digital khammam

What Is Blogging?

బ్లాగింగ్ అంటే ఏమిటి?

చాల మందికి డైరీ రాయటం , ఫొటోస్ తీయటం, ఎక్కడికైనా వెళ్లి వస్తే దాని గురించి మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చెప్తాము. అలాగే ఆన్లైన్ లో ఒక వెబ్సైటు (బ్లాగ్) క్రియేట్ చేసుకొని దానిలో మీకు తెలిసిన విషయాల గురించి సమాచారం పెట్టడాన్ని బ్లాగింగ్ అంటారు.

మనం బ్లాగింగ్ వెబ్సైటులో సమాచారం ఆర్టికల్ లాగా పెట్టాలి, చిన్నపుడు స్కూల్ డేస్ లో వ్యాసరచన పోటీలు (Essay competitions )లో ఎలాగయితే ఒక విష్యం గురించి వివరిస్తూ రాస్తామో అలాగా రాయాలి. దీన్ని బ్లాగింగ్ అంటున్నాము.

ప్రశ్న : బ్లాగింగ్ ఎవరైనా చెయొచ్చా ?
సమా : ఎవరైతే ఇంట్లో నుండి రిస్క్ లేకుండా మీకు నచ్చిన సమయాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరు చేయవచ్చు. దీనికి వయసు, ఆడవాళ్ళ లేదా మగవారు అని తేడా ఉండదు.

ప్రశ్న : మొబైల్ నుండి బ్లాగింగ్ చేయలేమా?
సమా : మొబైల్ నుండి చేయొచ్చు కానీ చాలా కష్టపడాలి, ఎందుకంటే మొబైల్ స్క్రీన్ చాల చిన్నగా ఉంటుంది, మీరు ఇన్ఫర్మేషన్ పెట్టాలంటే చిన్న కీప్యాడ్ లో టైపు చేయాలి.  చాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొబైల్ నుండి చేస్తే మీ వెబ్సైటు గూగుల్ లో రాంక్ చేయటం కూడా కష్టం అవుతుంది. కంప్యూటర్ లేదా లాప్టాప్ నుండి చేయటం వాళ్ళ మంచి రిజల్ట్స్ వచ్చి తక్కువ సమయంలో డబ్బు సంపాదించవొచ్చు.

ప్రశ్న : నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది , నేను కూడా బ్లాగ్గింగ్ చేయొచ్చా?
సమా : యూట్యూబ్ ఛానల్ ఉన్నవారు వాళ్ళ ఇన్కమ్ డబల్ చేసుకోవాలి అంటే బ్లాగింగ్ గుడ్ ఐడియా. మీ వీడియోస్ లో లింక్ ఇవ్వటం వలన మీ వెబ్సైటు ఈజీ గ వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ తో పాటుగా బ్లాగ్ నుండికూడా డబ్బు వస్తుంది. అఫిలియేట్ ప్రొడక్ట్స్ కూడా వెబ్సైటు లింక్ చేయొచ్చు. మీ ఛానల్ కి బ్రాండ్ కూడా పెరుగుతుంది.

ప్రశ్న: బ్లాగింగ్ ద్వారా డబ్బు ఎలా వస్తుంది?
సమా : మీరు పెట్టె సమాచారం ఎక్కువ మందికి వెళ్తే మీకు దాన్ని బట్టి గూగుల్ వాళ్ళు డబ్బు ఇస్తారు. ముందుగా మీ వెబ్సైటు గూగుల్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. యూట్యూబ్ కి ఎలాగ అప్రూవల్ వస్తుందో అదేవిధంగా.

ప్రశ్న : బ్లాగింగ్ నుండి ప్రతినెలా ఎంత డబ్బు సంపాదించవొచ్చు.
సమా : దీనికి లిమిట్ ఎం లేదు, మీ వెబ్సైటు వచ్చే ట్రాఫిక్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. సుమారుగా 10 నుండి 30 వేల వరకు కూడా ప్రతినెల సంపాదించవచ్చు. ప్రొఫెషినల్ బ్లాగర్స్ 1 లక్ష నుండి 5 లక్షలు సంపాదిస్తారు. కానీ దీనికి కొంత అనుభవం కావాలి.

ప్రశ్న : బ్లాగ్గింగ్ వెబ్సైటు కోసం మనీ అవుతుందా? ఎంత అవుతుంది?
సమా : ఒక వెబ్సైటు డిజైన్ చేయాలి అంటే మనకి డొమైన్ మరియు హోస్టింగ్ కావాలి. వీటిని మనం కొనాలి. చాలా తక్కువ ఖర్చుతో బ్లాగింగ్ వెబ్సైటు డిజైన్ చేసుకోవొచ్చు. ప్రతి నెల 350 రూ మాత్రమే అవుతుంది. ఒక సంవత్సరానికి 4300 రూ అవుతుంది.

ప్రశ్న : బ్లాగింగ్ వెబ్సైటు ఎలా క్రియేట్ చేసుకోవాలి ?
సమా : DigitalKhammam.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. Menu లో Hosting అని ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు Bluehost మరియు SiteGround ఆప్షన్స్ ఉంటాయి. BLUEHOST క్లిక్ చేయండి. Bluehost వాళ్ళు ఫ్రీగా డొమైన్ ఇస్తున్నారు.
తరువాత మీ వెబ్సైటుకి ఏమని పేరు పెట్టాలి అనుకున్నారో, దాన్ని టైప్ చేయండి.
తరువాత మీ పేరు, అడ్రెస్స్ ఆడ్ చేయాలి. తరువాత మీకు Hosting ఎన్ని నెలలకు కావాలి అని అడుగుతారు. 12 నెలలు సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీకు కొన్ని బాక్స్ టిక్ చేసి ఉంటాయి వాటిని UnSelect చేయండి. చివరిగా మీరు పేమెంట్ పేజీ లోకి వస్తారు. అక్కడ మీకు నచ్చిన విధంగా పేమెంట్ చేయొచ్చు.
తరువాత మీరు మీ వెబ్సైటు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఎటువంటి సందేహం వచ్చిన మమల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము సహాయం చేస్తాము.

ప్రశ్న : తెలుగులో బ్లాగింగ్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా?
సమా : ఇక్కడ ఉన్న అన్ని భాషలకి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. Arabic, Bengali, Bulgaria, Catalan, Chinese (simplified), Chinese (Traditional), Croatian, Czech, Danish, Dutch, English, Estonian, Filipino, Finnish, French, German, Greek, Hebrew, Hindi, Hungarian, Indonesian, Italian, Japanese, Korean, Latvian, Lithuanian, Malay, Malayalam, Marathi, Norwegian, Polish, Portuguese, Romanian, Russian, Serbian, Slovak, Slovenian, Spanish, Spanish (Latin American), Swedish, Tamil, Telugu, Thai, Turkish, Ukrainian, Urdu, Vietnamese.

ప్రశ్న : ఇంగ్లీష్ లో బ్లాగింగ్ చేస్తే మంచిదా తెలుగులో చేస్తే మంచిదా?
సమా : నేను ఇంగ్లీష్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ లో ఆర్టికల్ రాస్తే ప్రపంచంలో ఎవరైనా మీ ఆర్టికల్ చదవొచ్చు. ఎక్కువ ట్రాఫిక్ రావటానికి ఛాన్సెస్  ఉంటాయి. తెలుగు లో కూడా రాయొచ్చు మంచి వ్యూస్ అండ్ మనీ వస్తుంది. కానీ ఇంగ్లీష్ ఆర్టికల్ వచ్చినట్టుగా ట్రాఫిక్ రాదు.

ప్రశ్న : యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా వస్తుంది?
సమా : మీ బ్లాగ్ లో ఒక 30 పైగా ఆర్టికల్స్ పెట్టాలి, మీ ఆర్టికల్స్ లో సమాచారం సొంతగా రాయాలి, కాపీ చేసి పెట్టె వాటికీ అప్రువల్ రాదు. అఫిలియేట్ లింక్స్ కూడా ముందు పెట్టకూడదు. అప్రూవల్ వొచ్చాక పెట్టొచ్చు. 30 ఆర్టికల్స్ పెట్టక , మీ వెబ్సైటు ఒకసారి మొత్తం సెట్టింగ్స్ కరెక్ట్ గ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, యాడ్సెన్స్ అప్లై చేయాలి.

ప్రశ్న : ఎం టాపిక్స్ మీద బ్లాగింగ్ చేయొచ్చు?
సమా : అందరు ఎక్కువ మనీ ఎం టాపిక్ మీద వస్తే దాన్ని బ్లాగింగ్ కోసం సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అది చాల పెద్ద తప్పు. మనకి బాగా తెలిసిన విషయాల గురించి మాత్రమే బ్లాగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎక్కువ ఆర్టికల్స్ రాయొచ్చు.
పాపులర్ బ్లాగ్ టాపిక్స్
1. ఫుడ్
2, ఫ్యాషన్
3. లైఫ్ స్టైల్
4. హెల్త్ టిప్స్
5. కిచెన్ టిప్స్
6. ఫిటెనెస్ అండ్ డైట్
7. హోమ్ డెకరేషన్
8. గార్డెన్ టిప్స్
9. మనీ సేవింగ్ ఐడియాస్
10. టెక్నాలజీ
11. ప్రోడక్ట్ రివ్యూస్
12. ట్రావెల్
13. టెంపుల్స్ ఇలాగ చాల ఉన్నాయి .

ప్రశ్న : యూట్యూబ్ లాగా బ్లాగ్లో యాడ్స్ రావాలంటే ఏమైనా రూల్స్ ఉంటాయా?
సమా : యూట్యూబ్ లో యాడ్స్ రావాలి అంటే 1000 సబ్ స్క్రైబర్స్, మరియు 4000 గంటలు మీ వీడియోస్ ప్లే అవ్వాలి. కానీ బ్లాగింగ్  లో అలాగా రూల్స్ లేవు. మీ వెబ్సైటు ట్రాఫిక్ రాకపోయినా అప్రూవల్ వస్తుంది. మీ ఆర్టికల్స్ మాత్రమూ చాల జెన్యూన్ గ ఉండాలి. ఫొటోస్ కూడా మన సొంత ఫొటోస్ పెట్టాలి. గూగుల్ లో డౌన్లోడ్ చేసి పెట్టకూడదు.
తొందరగా యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే 30 ఆర్టికల్స్ పెట్టాలి, ప్రతి ఆర్టికల్ 700 నుండి 1000 వర్డ్స్ ఉండాలి. మీ వెబ్సైటు గూగుల్ అనలిటిక్స్ , సెర్చ్ కన్సోల్ కి లింక్ చేయాలి. మీ వెబ్సైటు మెనూ లో HOME , About Us, Contact Us, Privacy Policy, మరియు Disclaimer పేజెస్ ఉండాలి.

ప్రశ్న : ఎంత ట్రాఫిక్ వస్తే నెలకు 10వేలు సంపాదించవొచ్చు?
సమా : రోజు 1000 నుండి 5000 వేల వ్యూస్ వస్తే మీరు అనుకున్నట్లు డబ్బు సంపాదించవొచ్చు. అయితే మీ వెబ్సైటులో యాడ్స్ మీద క్లిక్స్ ఎక్కువ వస్తే తక్కువ వ్యూస్ వచ్చిన ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఆలా అని మన యాడ్స్ మనం క్లిక్ చేస్తే యాడ్సెన్స్ డిసేబుల్ అవుతుంది.

ప్రశ్న : మన ఆర్టికల్స్ గూగుల్ లో రాంక్ అవ్వాలి అంటే ఏమి చేయాలి?
సమా : గూగుల్ లో రాంక్ అవ్వటాన్ని SEO (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ ) అంటారు. దీనికి మీ ఆర్టికల్ దేనికి సంబంధించింది అని క్లియర్ గ గూగుల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా రాయాలి.అప్పుడు మీ ఆర్టికల్ రాంక్ అవుతుంది.

ప్రశ్న : బ్లాగ్ లో ఫొటోస్ , యూట్యూబ్ వీడియోస్ పెట్టొచ్చా?
సమా : మీకు నచ్చిన ఫొటోస్ , వీడియోస్ పెట్టొచ్చు. కానీ ఎక్కువ ఫొటోస్ పెడితే వెబ్సైట్ స్లోగ లోడ్ అవుతుంది.

ప్రశ్న : తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఆర్టికల్స్ రాయొచ్చా?
సమా : రాయొచ్చు, బ్లాగింగ్ వెబ్సైట్ లో మీకు ఆలా ప్రాబ్లెమ్ ఉండదు. మీకు నచ్చిన భాషలో రాయొచ్చు.

ప్రశ్న : మొదటి సంవత్సరం అయ్యాక మల్లి డబ్బులు కట్టాలా ?
సమా : మీరు 12 నెలలు హోస్టింగ్ తీసుకుంటే తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతె మీ వెబ్సైటు ఆగిపోతుంది.

ఇంకా మీకు ఏమైనా బ్లాగింగ్ గురించి సందేహాలు ఉంటే , మా యూట్యూబ్ ఛానల్ SANDEEP360TECH కామెంట్ చేయండి. ఫ్రీ సపోర్ట్ కోసం మా వెబ్సైట్ కి వాట్స్ అప్ లింక్ చేసాము దాని నుండి కాంటాక్ట్ అవ్వండి.

గమనిక ; మేము ఈ ఆర్టికల్ లో పూర్తి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నము. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మా ఆర్టికల్ మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ SANDEEP360TECH సబ్ స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఆక్టివేట్ చేయండి.

Open chat
1
How can i Help You?
Hello,
Feel Free to Ask Your Questions. We can Reply English and Telugu.