What Is Work From Home? Legal ways for online Money Making.

ఇంటిదెగ్గర నుండి డబ్బు సంపాదించడాన్ని Work From Home అంటారు.

అయితే చాల మంది డేటా ఎంట్రీ వర్క్స్ ఒక్కటే ఇంటినుండి చేసే వర్క్ అనుకుంటారు. కానీ అది తప్పు.

వర్క్ ఫ్రొం హోమ్ చాలా రకాలుగా ఉన్నాయి . అవి ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను.
ముందుగా మీరు ఇంటిదెగ్గర ఉండి డబ్బు సంపాదించాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

1. మీకు లాప్టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి.

2. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, లేదా మీ మొబైల్ లో హాట్ స్పాట్ కూడా వాడొచ్చు.

3. ఇంగ్లీష్ రాయటం మరియు చదవటం వచ్చి ఉండాలి.

4. కంప్యూటర్ ఉపయోగించటం రావాలి. ఉదా : ఇంటర్ నెట్ వాడటం, టైపింగ్, ఫొటోస్ వీడియోస్ డౌన్లోడ్ చేయటం.

5. అన్నిటికంటే మీరు ఎం పని చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి, అవగాహన లేకపోతే మీ సమయం మరియు డబ్బు వృధా అవుతుంది.

6. ముందుగా డబ్బు కట్టి జాబ్ లో జాయిన్ అవ్వండి అని ఎవరైనా అడిగితె నమ్మకండి, చాల వరకు మోసం చేసే వారు ఉంటారు .

7. మీ పని లో చురుకుతనం కోసం, మీకంటూ కొంత సమయాన్ని కేటాయించాలి. మీకు బాగా తెలిసిన మరియు ఇష్టం ఉన్న పనులు ఏం ఉంటాయో వాటికీ సంబంధిచిన వర్క్ చేస్తే మీకు కూడా ఇంట్రస్ట్ వస్తుంది. కష్టం గ ఉన్న ఇష్టంగా పనిచేయొచ్చు.

8. ముఖ్యముగా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన సందేహం వచ్చిన వెంటనే సహాయం అందించే వారు ఉండాలి.

9. మీ పనిమీద నమ్మకం మరియు ఓపిక ఉండాలి. వెంటనే డబ్బు వచ్చే మార్గాలు చూసి మోసపోకండి.

 

1. ప్రశ్న: డేటా ఎంట్రీ కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
సమా : చాల ఉన్నాయి , లీగల్ గ ఆన్లైన్ లో డబ్బు సంపాదనకు కొద్దిగా పెట్టుబడి కావాలి. మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఖర్చు ఉంటుంది.

2. ప్రశ్న: కంప్యూటర్ లేకుండా మొబైల్ నుండి చేయలేమా?
సమా : మొబైల్ నుండి చాల కొన్ని పనులు మాత్రమే చేయగలము కానీ పూర్తిగా చేయలేరు.

3. ప్రశ్న: కొత్త కంప్యూటర్ కొనాలి అంటే ఎంత అవుతుంది, ఎటువంటి కంప్యూటర్ కొనాలి?
సమా : మీరు పెట్టుబడి పెట్టగలను అనుకుంటే కొత్తది తీసుకోండి, లేదా మనకి మార్కెట్ లో 2nd హ్యాండ్ లాప్టాప్ తక్కువ కాస్ట్ కి వస్తాయి, నేను కూడా అటువంటి లాప్టాప్ వాడుతాను.
లాప్టాప్ లేదా కంప్యూటర్ కాన్ఫిగరేషన్ వివరాలు
1. i5 processor
2. 500 GB Hard Disk
3. 4 GB Ram
4. కనీసం 1 గంట బ్యాటరీ ఛార్జింగ్ ఉండే లాప్టాప్ తీసుకోండి. తెలిసిన వారి నుండి తీసుకుంటే తక్కువ రేటుకి వస్తుంది. సుమారుగా 13 నుండి 15 వేలు అవుతుంది . కొత్తది కొనాలి అనుకుంటే 30 వేలు పైన ఉంటుంది.

4. ప్రశ్న:ఎటువంటి రిస్క్ లేకుండా చేసే వర్క్ ఏమైనా ఉన్నాయా?
సమా : ఉన్నాయి , 1. బ్లాగింగ్ , 2. ఆఫిలియేట్ మార్కెటింగ్, 3. యూట్యూబ్ క్రియేటర్, 4. సోషల్ మీడియా మార్కెటింగ్, 5.వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఇంకా వేరు వేరు అవకాశాలు ఉన్నాయి . ముఖ్యంగ ఆడవారు చేసేవి బ్లాగింగ్ మరియు యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడం.

5.ప్రశ్న : బ్లాగింగ్ అంటే ఏమిటి? నిజంగా డబ్బు వస్తుందా? నెలకి ఎంత సంపాదించవచ్చు.
సమా : ఆన్లైన్ లో వెబ్సైటు ద్వారా మీకు తెలిసిన విషయాన్ని తెలియని వారికీ చెప్పటాన్ని బ్లాగింగ్ అంటారు. ఉదా : నేను మీకు ఇప్పడు ఈ ఆర్టికల్ ద్వారా ఎలాగయితే సమాచారాన్ని పంచుకుంటున్నానో అలాగా చేయటాన్ని బ్లాగింగ్ అంటున్నాము.

బ్లాగింగ్ ద్వారా డబ్బు వస్తుంది, మీ వెబ్సైటు కి ఎక్కువ మంది వచ్చి సమాచారాన్ని చూడటం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అయితే దీనికి గూగుల్ యాడ్సెన్స్ నుండి మీకు అప్రూవల్ రావాలి. అప్పుడు మీ వెబ్సైటు లో డబ్బు యాడ్స్ వస్తాయి, వాటి నుండి కొత్త డబ్బుని గూగుల్ వారు మీ అకౌంట్ కి పంపుతారు. ఈ ప్రాసెస్ కి మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.

నెలకి ఎంత డబ్బు వస్తుంది అంటే, మీ వెబ్సైటు కి వచ్చే వారిని బట్టి మీ సంపాదన ఉంటుంది, ఎక్కువ మందికి ఉపయోగపడే సమాచారం మీ దానిలో ఉంటే ఎక్కువ సార్లు మీ వెబ్సైటు ఓపెన్ చేస్తారు, అప్పుడు గూగుల్ వాళ్ళ యాడ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. సుమారుగా 10 నుండి 50 వేలు కూడా సంపాదించవచ్చు. కానీ దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది, మీరు చేసే పనిని బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది.

6. ప్రశ్న ; బ్లాగ్గింగ్ వెబ్సైటు కి డబ్బు ఏమైనా కట్టాలా ? ఎంత అవుతుంది? వెబ్సైటు ఎలా డిజైన్ చేయాలి?
సమా : బ్లాగింగ్ వెబ్సైటు కు డబ్బు కట్టాలి, ఎందుకంటే మన వెబ్సైటు ప్రపంచంలో ఎవరు చూసిన కనిపించాలి, ఎప్పుడూ ఆన్లైన్ సర్వర్ తో కనెక్ట్ అయ్యి ఉండాలి.
సుమారుగా ప్రతి నెల 350 రూపాయలు అవుతుంది, కానీ ఒక్కసారి సంవత్సరానికి డబ్బు కట్టాలి. ప్రతినెలా తీసుకోవటం కుదరదు.
మీ బ్లాగింగ్ వెబ్సైటు డిజైన్ చేసుకోవటం చాల సులభం, మీకు టెక్నికల్ నాలెడ్జి అవసరం లేదు. కేవలం ఒక గంటలోనే మీ వెబ్సైటు డిజైన్ చేసి మీ బ్లాగింగ్ కేరీర్ మొదలుపెట్టొచ్చు.

7. ప్రశ్న: యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? డబ్బు ఏమైనా కట్టాలా ?
సమా : యూట్యూబ్ ఛానల్ చాల సులువుగా మీ కంప్యూటర్ లేదా ఫోన్ నుండి క్రియేట్ చేయొచ్చు. ఎవరికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ గ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు.

8. ప్రశ్న: యూట్యూబ్ లో వీడియోస్ ఎలా పెట్టాలి ? ఎటువంటి వీడియోస్ పెట్టాలి ?
సమా: యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాక మీకు వీడియోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ వస్తుంది, దాని ద్వారా మీ కొత్త యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు.
మీకు నచ్చిన మరియు ఎక్కువ అవగాహనా ఉన్న టాపిక్ తీసుకోని వీడియోస్ పెట్టాలి. చాల మంది ఆడవారు వంటలు, వారు రోజు చేసే పనులు, బ్యూటీ టిప్స్, మొక్కలు ఎలా పెంచాలి, ఇలా వారికి నచ్చిన విషయం గురించి వీడియోస్ పెడతారు.

9. ప్రశ్న: యూట్యూబ్ నుండి ఎంత డబ్బు సంపాదించవొచ్చు? డబ్బు ఎవరు ఇస్తారు?
సమా: యూట్యూబ్ నుండి కూడా 10 నుండి 50 వేల వరకు ప్రతినెలా సంపాదించవొచ్చు. కానీ దీనికి మీ ఛానల్ యూట్యూబ్ మోనేటిజషన్ అప్రూవల్ రావాలి .
మీకు ప్రతినెల వచ్చే వ్యూస్ బట్టి యూట్యూబ్ వల్లే మీకు డబ్బు ఇస్తారు. చాల మంది మన తెలుగువారు సంపాదిస్తున్నారు.

గమనిక : నేను మీకు వివరించిన విషయాలు ఎటువంటి తప్పుడు సమాచారం(Fake) కాదు. మా ఛానల్ సబ్ స్క్రైబర్స్ కి ఫ్రీగా సపోర్ట్ ఇస్తున్నాము. మీరు మిగతా టాపిక్స్ గురించి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా వాట్స్ అప్ నెంబర్ 9014126056 మెసేజ్ చేయండి.
మా సమాచారం మీకు ఉపయోగ పడితే మా ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి , మీ స్నేహితులతో మా ఛానల్ వీడియోస్ షేర్ చేయండి.
మా ఛానల్ లింక్ : SanDeep360Tech

మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలి అనుకుంటే మా ఛానెల్ వీడియోస్ కింద కామెంట్ లో చెప్పండి. మీ కామెంట్స్ కొత్తగా వీడియోస్ చూసే వారికీ ఉపయోగపడతాయి.

ఇట్లు, మీ
సందీప్ చింతలపూడి.

Open chat
1
How can i Help You?
Hello,
Feel Free to Ask Your Questions. We can Reply English and Telugu.